ఏపీలో తగ్గిన కరోనా కేసులు

కొత్తగా 6,952 పాజిటివ్‌ కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ఉధృతి క్రమంగా తగ్గుతోంది. గడచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 6,952 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 11,577 మంది చికిత్సకు కోలుకున్నారు. 58 మంది ప్రాణాలు కోల్పోయారు. ఏపీలో ఇప్పటివరకు మొత్తం పాజిటివ్‌ కేసులు 18,03,074కు చేరాయి. 16,99,775 మంది చికిత్సకు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ప్రస్థుతం రాష్ట్రంలో 91,417 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 2,03,48,106 నమూనాలను పరీక్షించినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అత్యధికంగా చిత్తూరులో 1,199 కేసులు, అత్యల్పంగా నెల్లూరు జిల్లాలో 228 కేసులు నమోదయ్యాయి. 

మునుపటి వ్యాసం