సమయస్ఫూర్తితో మెడిసిన్ విద్యార్థిని కాపాడిన మత్స్యకారులు

మనస్తాపంతో ఆత్మహత్యకు యత్నించిన విద్యార్థి

నెల్లూరు: మనస్తాపంతో ఆత్మహత్యకు యత్నించిన విద్యార్థిని పోలీసులు, మత్స్యకారులు స్పందించి కాపాడారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్  రాష్ట్రంలోని నెల్లూరు జిల్లా మైపాడులో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... తిరుపతికి చెందిన రోహిత్ నెల్లూరులోని ఓ మెడికల్ కాలేజీలో మెడిసిన్ రెండో సంవత్సరం చదువుతున్నాడు.  అయితే మనస్తాపంతో ఆత్మహత్య చేసుకునేందుకు నిర్ణయించుకొని తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పాడు. దీంతో కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం అందించారు.

స్థానిక ఎస్ఐ పీ నరేష్ సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా రోహిత్ ఫోటోతో పాటు అతని బైక్ నెంబర్ ను వాట్సప్ ద్వారా మత్స్యకారులకు పంపించారు. అయితే యువకుడు మైపాడు పరిసర ప్రాంతాలలో ఉన్నట్టు వారు గుర్తించారు. మత్స్యకారులు రోహిత్ కోసం వెతుకుతుండగా సముద్రంలోకి ఏర్పాటు చేసిన వంతెన నుంచి రోహిత్ సముద్రంలోకి దూకాడు. ఇది గమనించిన మత్య్సకారులు సముద్రంలోకి వెళ్లి యువకుడిని కాపాడి బయటకి తీసుకొచ్చారు. సమయసూర్తితో స్పందించిన మత్య్సకారులకు పోలీసులు, యువకుడి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.

మునుపటి వ్యాసం