తెలంగాణకు మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు

ఉత్తర జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు

హైదరాబాద్: వాయువ్య బంగాళాఖాతం, పశ్చిమ బంగాళఖాతం, ఉత్తర ఒరిస్సా ప్రాంతాల్లో అల్పపీడనం కేంద్రీకృతమైంది. దీనికి అనుబంధంగా ఉపరితల అవర్తనం ఏర్పడినట్లు వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. వీటి ప్రభావంతో తెలంగాణలో రాగల మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు అధికారులు తెలిపారు. ఉత్తర జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు నమోదవుతాయని, మరికొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వారు పేర్కొన్నారు. లోతట్టు ప్రాంతాలకు హెచ్చరికలు జారీ చేశారు ఆయా జిల్లాలు అప్రమత్తంగా ఉండాలని వారు సూచిస్తున్నారు.