రీసెర్చ్ సెంట‌ర్‌ ఏర్పాటుకు కళాశాలల నుంచి ద‌ర‌ఖాస్తుల ఆహ్వానం

జూన్ 26 సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు ద‌ర‌ఖాస్తుకు చివ‌రి గ‌డువు

హైద‌రాబాద్: జవహర్‌లాల్ నెహ్రూ టెక్న‌లాజిక‌ల్ యూనివర్శిటీ-హైదరాబాద్ (జేఎన్‌టీయూ-హెచ్) 2021-22 విద్యా సంవత్సరానికి ‘రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు’ కోసం అనుబంధ కళాశాలల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ మేరకు శనివారం నోటిఫికేషన్ విడుదల చేసింది. కాలేజీలు యూజీసీ అటానమస్ స్టేటస్ క‌లిగి ఉండాలి లేదా సంబంధిత బ్రాంచ్‌లో ఏ గ్రేడ్, ఎన్‌బీఏతో ఎన్‌ఐఏసీ ఉండాలి. దరఖాస్తు ఫారం, పరిశోధనా కేంద్రం ఏర్పాటుకు మార్గదర్శకాలు, ఇతర వివరాలను యూనివర్సిటీ వెబ్‌సైట్ www.jntuh.ac.in నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని అధికార వర్గాలు వెల్లడించాయి. జూన్ 26 సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు ద‌ర‌ఖాస్తుకు చివ‌రి గ‌డువుగా నిర్ణయించారు.

 

మునుపటి వ్యాసం