వెస్టిండీస్‌ తో తొలిటెస్ట్ లో 322 పరుగులకు దక్షిణాఫ్రికా ఆలౌట్

డికాక్‌(141 నాటౌట్), డ్యూసెన్‌ (46)

హైదరాబాద్: వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో సౌతాఫ్రికా మొదటి ఇన్నింగ్స్‌లో 322 పరుగులకు ఆలౌటైంది.  ఓవర్‌నైట్‌ 128/4 స్కోరుతో దక్షిణాఫ్రికా శుక్రవారం రెండోరోజు ఇన్నింగ్స్‌ కొనసాగించగా డికాక్‌(141 నాటౌట్), డ్యూసెన్‌ (46) రాణించడంతో 322 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ మొదలుపెట్టిన వెస్టిండీస్ 4 వికెట్ల నష్టానికి 82 పరుగులు చేసింది. చేస్ 21 పరుగులతో, బ్లాక్ వుడ్ 10 పరుగులతో క్రీజులో ఉన్నారు. వెస్టిండీస్ ఇంకా 143 పరుగుల వెనుకంజలో ఉంది. వెస్టిండీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 97 రన్స్‌కే ఆలౌటైన సంగతి తెలిసిందే.

మునుపటి వ్యాసం