దేశ వ్యాప్తంగా క్రమంగా తగ్గుముఖం పట్టిన క‌రోనా

గడిచిన వ్యవధిలో 3,921 మంది ప్రాణాలొదిలారు

న్యూదిల్లీ: దేశంలో క‌రోనా కేసుల సంఖ్య క్ర‌మంగా త‌గ్గుతోంది. తాజాగా గ‌డిచిన 24 గంట‌ల వ్యవధిలో  కొత్తగా 70,421 కేసులు న‌మోదుకాగా, 24 గంట‌ల్లో 3,921 మంది క‌రోనాతో మృత్యువాత ప‌డ్డారు. ఏప్రిల్ 1 త‌ర్వాత ఇంత త‌క్కువ సంఖ్య‌లో కేసులు న‌మోద‌వ‌డం ఇదే మొదటి సారి. అయితే మ‌ర‌ణాల సంఖ్య మాత్రం కాస్త ఎక్కువ‌గానే ఉంది. ఇక 1,19,501 మంది క‌రోనా మహమ్మారి నుంచి కోలుకొని వివిధ ఆసుపత్రుల నుంచి కోలుకుని ఇళ్లకు వెళ్లారు. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 2,95,10,410కి చేరింది. కోలుకున్న వారు 2,81,62,947 కాగా.. చ‌నిపోయిన వారి సంఖ్య 3,74,305కి చేరింది. ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా 9,73,158 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక వ్యాక్సినేష‌న్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా 25,48,49,301కి చేరిన‌ట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్ల‌డించింది.

మునుపటి వ్యాసం