హైదరాబాద్ లో వందకు చేరిన పెట్రోల్ ధరలు

40 రోజుల నుంచి క్రమంగా పెంచుతున్న ధరలు

న్యూదిల్లీ: దేశంలో చమురు కంపెనీలు క్రమంగా వాటి ధరలను పెంచుతూనే పోతున్నాయి. దీంతో కరోనా మహమ్మారి లాంటి విపత్కర పరిస్థితుల్లో సామాన్యులపై అధిక భారం పడుతోంది. తాజాగా లీటర్‌ పెట్రోల్‌పై 29 పైసలు, డీజిల్‌పై 31 పైసలకు పెరిగింది. దేశవ్యాప్తంగా చాలా నగరాల్లో ఏడు ప్రధాన నగరాల్లో లీటర్ పెట్రోల్‌ ధర రూ.100 మార్క్‌ను దాటింది. కొత్తగా పెంచిన ధరలతో దేశ రాజధాని దిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.96.41, డీజిల్‌ రూ.87.28 గా ఉంది. హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.100 మార్కెట్‌ను దాటింది.

ప్రస్తుతం లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.100.20కు చేరగా డీజిల్‌ లీటర్‌ రూ.95.14కు పెరిగింది. దాదాపు ఐదారు జిల్లాలు మినహా రాష్ట్రవ్యాప్తంగా మిగతా అన్ని ప్రాంతాల్లో లీటర్‌ పెట్రోల్‌ రూ.100 దాటింది. అత్యధికంగా ఆదిలాబాద్‌, జోగులాంబ గద్వాల, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, నిజామాబాద్‌ జిల్లాల్లో పెట్రోల్‌ రూ.102కుపైగా ధర పలుకుతుండగా భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, కామారెడ్డి, మెదక్‌, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌, నిర్మల్‌, సిద్దిపేట, సూర్యాపేట, నల్గొండ, యాదాద్రి భువనగిరితో పాటు పలు జిల్లాల్లో లీటర్‌ పెట్రోల్‌ రూ.100 దాటింది. డీజిల్ ధరలు ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. మరో వైపు రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌లో లీటర్ పెట్రోల్‌రూ.107, లీటర్‌ డీజిల్‌ రూ.100కుపైగా దాటింది.