భాజపా తీర్థం పుచ్చుకున్న ఈటల రాజేందర్

ఈటల చేరికతో తెలంగాణ భాజపా బలోపేతం

న్యూదిల్లీ: తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్ సోమవారం భాజపా కండువ కప్పుకున్నారు. దిల్లీలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ ఛార్జ్ తరుణ్ చుగ్ సమక్షంలో ఆయన భాజపాలో చేరారు. ఆయన తోపాటు మాజీ ఎంపీ రమేశ్ రాథోడ్, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, మాజీ జడ్పీ ఛైర్ పర్సన్ తుల ఉమ, ఆర్టీసీ కార్మీక సంఘ నేత అశ్వత్థామరెడ్డి, ఉస్మానియా ఐకాస నేతలు భాజపాలో చేరారు.  ఈ సందర్భంగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ... ఈటల వంటి నేతలు భాజపాలో చేరటంతో తెలంగాణలో పార్టీ బలపడుతోందన్నారు. ఆయన ఆర్థిక, వైద్యఆరోగ్యశాఖ మంత్రిగా ఎనలేని సేవలందించారని ఆయన అన్నారు. 

మునుపటి వ్యాసం