హైదరాబాద్‌లో పలు చోట్ల భారీ వర్షం

మరో రెండు రోజులపాటు వర్షాలు

హైదరాబాద్‌: నగరంలో పలు చోట్ల సోమవారం తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాల్లోని కాలనీలు, రోడ్లు జలమయమయ్యాయి. నైరుతి రుతుపవనాలు, వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో పాటు ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రానున్న మూడు రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ వెల్లడించిన విషయం తెలిసిందే. నగరంలోని వనస్థలీపురం, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మసబ్ ట్యాంక్, మెహిదీపట్నం, యూసఫ్‎గూడ, క్రిష్ణానగర్, పంజాగుట్ట, మియాపూర్‌, కూకట్‌పల్లి, ఎర్రగడ్డ, అమీర్‌పేట, బేగంపేట, సికింద్రాబాద్‌, తార్నాక, ఉప్పల్‌, దిల్‌సుఖ్‌నగర్‌, మలక్‌పేట,  కూకట్‎పల్లి, జీడిమెట్లతో పాటు పరిసర ప్రాంతాల్లో మోస్తారు వర్షం కురిసింది. 

 

మునుపటి వ్యాసం