సీజీఎస్టీలో ట్యాక్స్ అసిస్టెంట్‌ ఉద్యోగాలు

దరఖాస్తుకు చివరి జూన్ 30 చివరి తేది

న్యూదిల్లీ: సెంట్ర‌ల్ గూడ్స్ అండ్ స‌ర్వీస్ ట్యాక్స్ (సీజీఎస్టీ) ట్యాక్స్ స్పోర్ట్స్ కోటాలో అసిస్టెంట్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఆస‌క్తి, అర్హ‌త క‌లిగినవారు దరఖాస్తు చేసుకోవాల‌ని కోరింది. ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తులు ఈనెల 30 వ‌ర‌కు అందుబాటులో ఉంటాయ‌ని తెలిపింది. ఎంపికైన‌వారు గుజ‌రాత్‌లోని వ‌డోద‌రాలో ప‌నిచేయాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ లో మొత్తం 11 పోస్టులను భర్తీ చేయనున్నారు. డిగ్రీ పూర్తి చేసినవారు ఈ ఉద్యోగానికి అర్హులు. ఆన్ లైన్ లో దరఖాస్తు సమర్పణకు జూన్ 30ని చివరి తేదీగా అధికారులు వెల్లడించారు. పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: www.ccovadodarazone.gov.in.

మునుపటి వ్యాసం