లోక్‌స‌భ‌లో ఎల్‌జేపీ నేత‌గా చిరాగ్ పాశ్వాన్ తొల‌గింపు!

ప‌శుప‌తి కుమార్‌ను పార్టీ ప‌క్ష నేత‌గా ఎన్నుకున్న‌ట్లు లోక్‌స‌భ స్పీక‌ర్‌కు లేఖ

న్యూదిల్లీ: బీహార్ రాజ‌కీయాల్లో స‌రికొత్త మలుపులు తిరుగుతోంది. లోక్‌జ‌న‌శ‌క్తి పార్టీలో (ఎల్‌జేపీ) అసంతృప్తి వేలువడినట్లు తెలుస్తోంది.  లోక్‌స‌భ‌లో పార్టీ ప‌క్ష‌నేత‌గా ఉన్న‌ పార్టీ అధ్య‌క్షుడు చిరాగ్ పాశ్వాన్‌ను సాటి ఎంపీలు తొల‌గించారు. కొత్త‌గా ఎంపీ ప‌శుప‌తి కుమార్‌ను పార్టీ ప‌క్ష నేత‌గా ఎన్నుకున్న‌ట్లు లోక్‌స‌భ స్పీక‌ర్‌కు లేఖ స‌మ‌ర్పించారు. ఈమేర‌కు స్పీక‌ర్ ఓం ప్ర‌కాశ్ బిర్లాను క‌లిసి ప‌శుప‌తి కుమార్‌ను పార్టీప‌క్ష నేత‌గా గుర్తించాల‌ని కోరిన‌ట్లు తెలుస్తోంది. ప‌శుప‌తి కుమార్ ప్ర‌స్తుతం బీహార్‌లోని హాజీపూర్ లోక్‌స‌భస్థానం నుంచి ప్రాతినిథ్యం వ‌హిస్తున్నారు.

గ‌త ఎన్నిక‌ల్లో పార్టీ త‌ర‌ఫుణ మొత్తం ఆరుగురు ఎంపీలు గెలుపొందారు. వారిలో చిరాగ్ పాశ్వాన్ కూడా ఒక‌రు. అయితే అత‌ని ప‌నితీరుపై మిగిలిన ఎంపీలు అస‌హ‌నంతో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో మిగిలిన ఎంపీలు క‌లిసి ప‌శుప‌తి కుమార్‌ను కొత్త పార్టీప‌క్ష నేత‌గా ఎంపిక‌చేశారు. ఎల్‌జేపీ ప్ర‌స్తుతం ఎన్డీయేలో భాగ‌స్వామిగా కొనసాగుతోంది. 

మునుపటి వ్యాసం