దేశ‌ద్రోహం కేసుపై ముంద‌స్తు బెయిల్ కోరిన ఆయిషా సుల్తానా

కేంద్రం కొవిడ్-19ను జీవాయుధంగా వ‌దిలిన‌ట్లు ఆరోపించినందుకు కేసు నమోదు

తిరువ‌నంత‌పురం: ల‌క్ష‌ద్వీప్ సామాజిక కార్య‌క‌ర్త‌, ఫిల్మ్‌మేక‌ర్ అయిషా సుల్తానా ఇవాళ కేర‌ళ కోర్టును ఆశ్ర‌యించారు. దేశ‌ద్రోహం కేసులో ముంద‌స్తు బెయిల్ జారీ చేయాల‌ని కోరుతూ ఆమె కోర్టును వేడుకున్నారు. ఇటీవ‌ల మీడియావ‌న్‌టీవీ అనే మ‌ళ‌యాళీ ఛాన‌ల్‌తో సుల్తానా మాట్లాడుతూ.. ల‌క్ష‌ద్వీప్ ప్ర‌జ‌ల‌పై కేంద్ర ప్ర‌భుత్వం కొవిడ్-19ను జీవాయుధంగా వ‌దిలిన‌ట్లు ఆరోపించారు. ల‌క్ష‌ద్వీప్‌లో ఉన్న అడ్మినిస్ట్రేట‌ర్ ప్ర‌ఫూల్ ప‌టేల్‌ను ఆమె బ‌యోవెప‌న్ అని సంబోధించారు. దీనిపై భాజపా యూనిట్ అధ్య‌క్షుడు సీ అబ్దుల్ ఖాదిర్ హ‌జీ ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేశారు. ఐపీసీలోని సెక్ష‌న్ 124ఏ ప్ర‌కారం ఆమెపై దేశ‌ద్రోహం కేసు న‌మోదైంది. ల‌క్ష‌ద్వీప్‌లోని కావ‌ర‌ట్టి పోలీసు స్టేష‌న్‌లో  కేసు నమోదైంది. విద్వేష‌పూరితంగా మాట్లాడిన‌ట్లు కూడా ఆమెపై కేసు బుక్ చేశారు. 

మునుపటి వ్యాసం