కావేటి లక్ష్మీనారాయణ మృతి పట్ల కేసీఆర్ సంతాపం

సానుభూతి ప్రకటించిన దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి

హైదరాబాద్‌: తెరాస సీనియర్‌ నేత కావేటి లక్ష్మీనారాయణ మృతి పట్ల సీఎం కేసీఆర్‌ సంతాపం తెలిపారు. కావేటి మరణంతో నిబద్ధత కలిగిన నేతను పార్టీ కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కావేటి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి కావేటి లక్ష్మీనారాయణ మృతి పట్ల సంతాపం తెలిపారు. పార్టీ కోసం లక్ష్మీ నారాయణ ఎంతో కష్టపడ్డారని మంత్రి పేర్కొన్నారు. ఆయ‌న ఆత్మకు శాంతి చేకూరాల‌ని భగవంతున్ని ప్రార్థించారు.