రేపు యాదాద్రికి జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ‌

స్వామి వారి దర్శనం అనంతరం, ఆల‌య పున‌ర్ నిర్మాణపనుల పరిశీలన

హైద‌రాబాద్: ఈ నెల 15వ తేదీన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ ర‌మ‌ణ యాదాద్రి సందర్శనకు రానున్నారు. ఉద‌యం 7 గంట‌ల‌కు హైద‌రాబాద్ నుంచి అవుటర్ రింగ్ రోడ్డు మీదుగా రోడ్డుమార్గంలో యాదాద్రి బ‌య‌ల్దేర‌నున్నారు. 8:30 గంట‌ల‌కు అక్క‌డ‌కు చేరుకుని ఉద‌యం 8:45 గంట‌ల‌కు శ్రీల‌క్ష్మీన‌ర‌సింహ‌స్వామి వారిని ద‌ర్శించుకుని స్వామి వారి ఆశీర్వ‌చ‌నం తీసుకుంటారు. 9:15 గంట‌ల‌కు ఆల‌య పున‌ర్ నిర్మాణాన్ని ప‌రిశీలించ‌నున్నారు. 9:45 గంట‌ల‌కు వీవీఐపీ గెస్ట్ హౌజ్‌లో అల్పాహారం చేయ‌నున్నారు. ఉద‌యం 10 గంట‌ల‌కు టెంపుల్ సిటీని సంద‌ర్శించి, హైద‌రాబాద్‌కు తిరుగు ప్ర‌యాణం కానున్నారు.

 

మునుపటి వ్యాసం