మహారాష్ట్రలో భారీ వర్షాలు

ముందుగానే బాబ్లీ గేట్ల ఎత్తివేత

ముంబయి: మహారాష్ట్ర, గోదావరి నదీ పరివాహక ప్రాంతాల్లో గత వారం రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఎగువ ప్రాంతంలోని వర్షపు నీరంతా గోదావరిలో కలుస్తుండటంతో వరదనీటి ప్రవాహం పెరిగింది. మహారాష్ట్ర ప్రభుత్వం బాబ్లీగేట్లు కొద్దిమేర ఎత్తి వరదనీటిని దిగువకు విడుదల చేశారు. బాబ్లీగేట్లు ప్రతి ఏటా జులై 1న ఎత్తివేసి అక్టోబర్ 23 వరకూ తెరిచి ఉంచుతారు. అయితే ఎగువన కురుస్తున్న భారీ వర్షాలను దృష్టిలో ఉంచుకుని బాబ్లీగేట్లను ముందుగానే ఎత్తినట్టు నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. మరో వైపు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో మంజీరా నదిలో కూడా వరదనీటి ప్రవాహం పెరిగినట్టు అధికారులు వెల్లడించారు.

మునుపటి వ్యాసం