కుమ్రం భీం జిల్లాలో నకిలీ పత్తి విత్తనాల పట్టివేత

నకిలీ విత్తనాలు అమ్మే వారిపై పీడీ యాక్ట్

కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా: జిల్లాలోని వాంకిడి, రెబ్బెన మండలాల్లో సోమవారం సుమారు రెండు లక్షల రూపాయల విలువ చేసే నకిలీ పత్తి విత్తనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్బంగా జిల్లా అదనపు ఎస్పీ అచ్చేశ్వర్రావు మాట్లాడుతూ.. నకిలీ విత్తనాలు అమ్మే వారిపై పీడీ యాక్ట్ కేసులు పెడతామని హెచ్చరించారు. రైతులు నకిలీ విత్తనాలు అమ్మే వ్యాపారుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. అనుమానం వచ్చిన విత్తనాలపై తమ దృష్టికి తీసుకురావాలని సూచన.