పల్లె చెరువును పరిశీలించిన మేయర్ విజయలక్ష్మి, ఎమ్మెల్యే ప్ర‌కాశ్‌గౌడ్‌

గతేడాది జరిగిన నష్టం పునరావృతం కాకుండా చర్యలు

హైద‌రాబాద్‌: రాష్ట్రంలోని హైదరాబాద్ తోపాటు పలు ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. గతేడాది భారీ వర్షాలు, వరదలతో భారీ నష్టం వాటిల్లిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ ఏడాది వరదలు రాకుండా నగర కార్పోరేషన్ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి ఎమ్మెల్యే ప్ర‌కాశ్‌గౌడ్‌తో కలిసి మైలార్‌దేవ్‌ప‌ల్లిలోని ప‌ల్లెచెరువును సోమవారం పరిశీలించారు. చెరువులో గుర్రపుడెక్కను తక్షణమే తొలగించాలని ఆమె అధికారులను ఆదేశించారు. భారీ వర్షాలతో పల్లెచెరువుకు గండి పడకుండా పోయినేడాది పరిస్థితి పునరావృతం కాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని మేయర్ విజయలక్ష్మి అధికారులకు సూచించారు.