ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన కారు

వాహన దారుడు మృతి..కేసు నమోదు

యాదాద్రి భువ‌న‌గిరి: యాద‌గిరిగుట్ట‌లో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. యాద‌గిరిగుట్ట మండ‌ల పరిధిలోని వంగ‌ప‌ల్లి శివారులో ఓ ద్విచక్రవాహనాన్ని వేగంగా వచ్చిన ఓ కారు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనదారుడు అక్కడికక్కడే ప్రాణాలొదిలాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు. మృతుడు రామాజీపేట గ్రామానికి చెందిన ఐల‌య్య (75)గా గుర్తించినట్టు పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం ఐలయ్య మృత‌దేహాన్ని ఆసుపత్రికి త‌ర‌లించారు. కేసు న‌మోదుచేసి, ద‌ర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.