కరోనాతో మరణిస్తే రూ.25 లక్షల పరిహారం

వైద్యులకు అండగా ఏపీ ప్రభుత్వం

అమరావతి: మహమ్మారి కరోనా వైరస్ బారిన పడి మృతి చెందిన వైద్య సిబ్బంది కుటుంబానికి ఏపీ ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. కేటగిరీల వారిగా పరిహారం ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కరోనాతో వైద్యులు మరణిస్తే రూ.25 లక్షల పరిహారం, స్టాఫ్ నర్సులు మరణిస్తే రూ.20 లక్షలు, ఎంఎస్ఒ, ఎఫ్ఎస్ఒలు మరణిస్తే రూ.15 లక్షలు, ఇతర వైద్య సిబ్బంది మరణిస్తే రూ.10 లక్షల పరిహారం వర్తింపజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో వైద్యులు, నర్సులు, స్టాఫ్ నర్సులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మునుపటి వ్యాసం