రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు వ‌ర్షాలు

అప్రమత్తంగా ఉండాలని సూచన

హైద‌రాబాద్: రాష్ట్రంలో మూడు రోజుల పాటు వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం తెలిపింది. ఇవాళ తేలిక‌పాటి నుంచి మోస్త‌రు వ‌ర్షం కురిసే సూచనలున్నట్లు వెల్లడించింది. ప‌లు జిల్లాల్లో రేపు, ఎల్లుండి ఉరుములు, మెరుపుల‌తో కూడిన వ‌ర్షం కురిసే అవ‌కాశం ఉందని వాతావ‌ర‌ణ కేంద్రం ప్రకటించింది. గ‌త నాలుగైదు రోజుల నుంచి వ‌ర్షాలు విస్తారంగా కురుస్తున్న విష‌యం తెలిసిందే. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన.

మునుపటి వ్యాసం