కరోనా పాజిటివ్ కేసుల నుంచి ఏపీకి కొంత ఊరట

వైరస్ బారిన పడి మరో 59 మంది మృతి

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో  కొత్తగా 4,549 మందికి కరోనా వైరస్ సోకినట్లు, కరోనాతో మరో 59మంది ప్రాణాలు కోల్పోయారని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజా హెల్త్ బులిటెన్ లో వెల్లడించింది. తాజాగా కేసులతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 18,07,623కు చేరుకుంది. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా వైరస్ బారిన పడి 11,941మంది బాధితులు మరణించారు. గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి 10,114మంది బాధితులు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.

మునుపటి వ్యాసం