బావిలో పడి క‌ల్లు గీత కార్మికుడు మృతి

తాటి చెట్టు ఎక్కుతున్న క్ర‌మంలో కాలు జార‌డంతో ఘటన

పెద్ద‌ప‌ల్లి: పెద్ద‌ప‌ల్లి జిల్లా ఓదెల మండ‌లం జీల‌కుంట గ్రామంలో విషాదం నెల‌కొంది. తాటి చెట్టు మీద నుంచి ప‌డి క‌ల్లు గీత కార్మికుడు ఏరుకొండ తిరుప‌తి గౌడ్‌(35) మృతి చెందాడు. ఈ ఘ‌ట‌న శుక్ర‌వారం సాయంత్రం చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తాటి చెట్టు ఎక్కుతున్న క్ర‌మంలో కాలు జార‌డంతో ప‌క్క‌నే బావిలో ప‌డిపోయి ప్రాణాలు కోల్పోయాడు. అదే రోజు చీకటి పడినా తిరుప‌తి గౌడ్‌ ఇంటికి రాకపోవ‌టంతో ఆచూకీ కోసం కుటుంబ స‌భ్యులు వెతికారు. చివ‌ర‌కు బావిలో తిరుప‌తి మృత‌దేహాన్ని కనుగొన్నారు. మృత‌దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సుల్తానాబాద్ ఆసుపత్రికి త‌ర‌లించారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. తిరుప‌తి గౌడ్‌కు భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు.

మునుపటి వ్యాసం