ఏపీలో కొత్తగా 2,526 కేసులు

వైరస్ బారిన పడి 24 మంది మృతి

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 93,785 పరీక్షలు నిర్వహించగా 2,526 కేసులు నిర్ధారణ అయ్యాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో కొవిడ్‌ వల్ల 24 మంది బాధితులు ప్రాణాలు కోల్పోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 13,081కి చేరింది. 24 గంటల వ్యవధిలో 2,933 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 18,93,498కి చేరినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 19,32,105 మంది వైరస్‌ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 25,526 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,33,14,697 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది. 

మునుపటి వ్యాసం