బ్రహ్మంగారి మఠంపై ఏపీ హైకోర్టు తీర్పు

నిబంధనలకు అనుగుణంగా పీఠాధిపతిని ఎంపిక చేయాలని సూచన

అమరావతి: బ్రహ్మంగారి మఠంపై థార్మిక పరిషత్‌ తీర్మానం నిబంధనలకు అనుగుణంగా లేదని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తేల్చి చెప్పింది. నిబంధనలకు అనుగుణంగా పీఠాధిపతిని ఎంపిక చేయాలని సూచించింది. బ్రహ్మంగారి మఠం విషయంలో ప్రభుత్వ ఆదేశాలను న్యాయస్థానం కొట్టివేసింది. పీఠాధిపతి విషయంలో ఖాళీ ఏర్పడితే తాత్కాలిక చర్యలు తీసుకునే అధికారం థార్మిక పరిషత్‌కు ఉందని, అయితే థార్మిక పరిషత్ నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించలేదని హైకోర్టు స్పష్టం చేసింది.