చెరువులో మునిగి ఇద్దరు బాలికల మృతి

గ్రామంలో అలముకున్న విషాద ఛాయలు

చిత్తూరు: జిల్లాలోని శాంతిపురం మండలంలో సోమవారం విషాదం చోటు చేసుకుంది. చెరువులో పడి ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు బాలికలు మృతిచెందిన ఘటన చిన్నారిదొడ్డి గ్రామంలో చోటుచేసుకుంది. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. దేవిశ్రీ (12), శిల్ప (10) తమ నానమ్మతో కలిసి సోమవారం ఉదయం గొర్రెలను మేపేందుకు గ్రామ శివారుకు వెళ్లారు. శివారులోని చెరువు వద్ద వారు ఆడుకుంటూ వెళ్లి చెరువులో జారిపడి ప్రాణాలొదిలారు. ఘటనాస్థలిని పోలీసులు పరిశీలించారు. దేవిశ్రీ, శిల్పల మృతదేహాలను చెరువు నుంచి వెలికి తీసి, పోస్టుమార్టం కోసం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

 

మునుపటి వ్యాసం