గాయని మంగ్లీపై చర్యలు తీసుకోవాలని సీపీకి ఫిర్యాదు

బోనాల పండుగ పాటలో అభ్యంతరకర పదాలున్నాయని ఫిర్యాదు

హైదరాబాద్: తెలంగాణలో బోనాల పండుగ సందర్భంగా ప్రముఖ గాయని మంగ్లీ పాడిన పాటపై వివాదం నెలకొంది. మంగ్లీ పాడిన పాటలో అభ్యంతరక పదాలు వాడారని, గాయని మంగ్లీపై వెంటనే చర్యలు తీసుకోవాలని మల్కాజ్ గిరి భాజపా కార్పోరేటర్ నగర సీపీకి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన మంగ్లీ పాటలో ఉన్న అభ్యంతరకర పదాలను తొలగించామని పేర్కొన్నారు. పాటపై విమర్శలు వచ్చిన రోజే మార్చేశామని, గ్రామ దేవతను ఎలా పూజిస్తారో తెలుసుకుని విమర్శిస్తే మంచిదని ఆమె మండిపడింది.