ద్విచక్రవాహనం అదుపుతప్పి యువకుడు మృతి

నగరంలోని బాలానగర్ వంతెనపై ఘటన

హైదరాబాద్‌: ద్విచక్రవాహనం అదుపుతప్పి యువకుడు మృతి చెందిన ఘటన  నగరంలోని బాలానగర్ వంతెనపై జరిగింది. ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా కొనిదెన గ్రామానికి చెందిన అశోక్(24) అనే యువకుడు లారీ డ్రైవర్‌గా చేస్తున్నాడు. లైసెన్స్ తీసుకునేందుకు ద్విచక్రవాహనం మీద తిరుమలగిరిలోని ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లాడు. తిరిగి వస్తున్న క్రమంలో అతివేగంతో గోడకు సేఫ్టీ గోడను ఢీకొన్నాడు. ఇది గమనించిన స్థానికుల వెంటనే 108లో అశోక్‌ని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు పేర్కొన్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న బాలానగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిద్రమత్తు కారణంగానే వాహనం అదుపుతప్పి ప్రమాదం చోటుచేసుకుందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.