కేసీఆర్ సమక్షంలో తెరాసలో చేరిన కౌశిక్ రెడ్డి

కండువ కప్పి తెరాసలోకి ఆహ్వానించిన సీఎం

హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ మాజీ నేత పాడి కౌశిక్ రెడ్డి బుధవారం తెరాస కండువ కప్పుకున్నారు. కౌశిక్ రెడ్డితో పాటు ఆయన అనుచరులు తెరాసలో చేరారు. టీఆర్ఎస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితుడినై తెరాసలో చేరుతున్నట్లు కౌశిక్ రెడ్డి ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. రాష్ట్ర అభివృద్ధికి దోహదపడాలని కౌశిక్ రెడ్డి తమ పార్టీలో చేరారని కేసీఆర్ వ్యాఖ్యానించారు. కౌశిక్ రెడ్డి తండ్రి సాయినాథ్ రెడ్డి తనతో కలిసి పనిచేశారని ముఖ్యమంత్రి  గుర్తుచేసుకున్నారు. కౌశిక్ రెడ్డి, ఆయన అనుచరులను సాదరంగా ఆహ్వానిస్తున్నాని సీఎం తెలిపారు. నాడు చెన్నారెడ్డి ఉద్యమాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లారు. తెలంగాణ ప్రజాసమితి అప్పట్లోనే 11 ఎంపీ సీట్లు గెలుచుకుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

మునుపటి వ్యాసం