మిఠాయిలు పంచుకున్న భారత్-పాక్ సైనికాధికారులు

బంగ్లాదేశ్ సరిహద్దులలో కూడా బక్రీద్ పండుగ శుభాకాంక్షలు సైనికులు

న్యూదిల్లీ: బక్రీద్ పండుగ సందర్భంగా భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లో ఇరుదేశాల సైనికాధికారులు మిఠాయిలు పంచుకున్నారు. పండుగ శుభాకాంక్షలు తెలిపారు. బుధవారం జమ్ము కశ్మీర్‌లోని కమన్‌అమాన్ సేతు వద్ద భారత్-పాకిస్థాన్ మధ్య సమావేశం జరిగింది. కాల్పుల విరమణ ఒప్పందం అమలుపై చర్చ కార్యక్రమాన్ని నిర్వహించారు. చర్చల అనంతరం బక్రీద్ సందర్భంగా ఇరుదేశాల అధికారులు మిఠాయిలు పంచుకున్నారు. భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులలో కూడా ఇరు దేశాల సైనికులు మిఠాయిలు పంచుకొని పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.


Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox

మునుపటి వ్యాసం