సాహితీవేత్త ఎల్లూరి శివారెడ్డికి దాశరథి పురస్కారం

రేపు రవీంద్రభారతిలో పురస్కారం అందజేత

హైదరాబాద్: ప్రముఖ సాహితీవేత్త, తెలుగు విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి డాక్టర్ ఎల్లూరి శివారెడ్డికి 2021 సంవత్సరానికి దాశరథి కృష్ణమాచార్య పురస్కారం దక్కింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎంపిక కమిటీ ఆయన పేరును ఖరారు చేసింది. దాశరథి జయంతి సందర్భంగా రేపు రవీంద్రభారతిలో జరిగే కార్యక్రమంలో రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆయనకు ఈ పురస్కారాన్ని అందిస్తారు.