తెలంగాణ ఉద్యమకారులు నిరాశకు గురవుతున్నారు: రేవంత్ రెడ్డి

దిల్లీ పర్యటనలో భాగంగా రేవంత్ రెడ్డి వెల్లడి

హైదరాబాద్: తెలంగాణ ఉద్యమకారులు నిరాశకు గురవుతున్నారని కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. దిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఉద్యమకారులు తెరాసతో విసుగుచెందారని వ్యాఖ్యానించారు. ఇందులో భాగంగా సామ వెంకట్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరబోతున్నారని రేవంత్ రెడ్డి తెలిపారు. ఉద్యమ సమయంలో   వెంకట్ రెడ్డి క్రియాశీలక పాత్ర పోషించారని స్పష్టం చేశారు. నిరుద్యోగులకు తెలంగాణలోని ప్రైవేటు సెక్టార్లలో ఉద్యోగాలు కల్పించాలని సామ వెంకట్ రెడ్డి తొలి నుంచి ఉద్యమాలు చేశారని రేవంత్ గుర్తు చేశారు. ఏ ఆశయం కోసమైతే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారో ఇప్పుడు ఆ పరిస్థితి తెలంగాణలో లేదన్నారు. తెలంగాణలో కేసీఆర్ పై విశ్మాసం సడలిపోయిందని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పేదల భూములు గుంజుకుని తక్కువ ధరకే పరిశ్రమలకు కేటాయించారని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.