ఎయిమ్స్‌లో బర్డ్‌ఫ్లూతో బాలుడు మృతి

భారత్‌లో తొలి బర్డ్‌ఫ్లూ మరణం

న్యూదిల్లీ: దేశంలో తొలి బర్డ్‌ఫ్లూ మరణం నమోదైంది. దిల్లీ ఎయిమ్స్‌లో బర్డ్‌ఫ్లూతో బాధపడుతూ 11 ఏళ్ల బాలుడు మరణించాడు. దీంతో ఆ బాలుడికి చికిత్స అందించిన వైద్యులు సిబ్బంది ఐసొలేషన్‌కు వెళ్లారు. హరియాణాకు చెందిన సుశీల్ అనే బాలుడు న్యుమోనియా, లుకేమియా లక్షణాలతో ఈనెల 2న దిల్లీ ఎయిమ్స్‌లో చేరాడు. కరోనా పరీక్షలో నెగిటివ్ గా నిర్ధారణ అయింది. సుశీల్ నమూనాలను పుణె లోని జాతీయ వైరాలజీ సంస్థకు పరీక్ష కోసం పంపగా, బర్డ్‌ఫ్లూ అని బయటపడింది.

భారత్‌లో బర్డ్‌ఫ్లూతో వ్యక్తి చనిపోవడం ఇదే మొదటిసారి. దీంతో మరిన్ని కేసులను గుర్తించడానికి కాంటాక్ట్ ట్రేస్ చేయడానికి నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ఓ బృందాన్ని హరియాణాలోని బాలుడి స్వగ్రామానికి పంపింది. ఈనెల బర్డ్ ఫ్లూ వైరస్ జాతి అయిన హెచ్5 ఎన్6 స్ట్రెయిన్ చైనాలో ఓ వ్యక్తికి సోకినట్టు మీడియా సంస్థలు వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ప్రారంభంలో భారత్‌లో మహారాష్ట్ర, గుజరాత్, చత్తీస్‌గఢ్, కేరళ, మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లో బర్డ్‌ఫ్లూ కారణంగా వేల సంఖ్యలో పక్షులు, కోళ్లు మృతి చెందాయి. పంజాబ్ లోనే 50 వేల పక్షులు మృతిచెందాయి. అయితే బర్డ్‌ఫ్లూ మనుషులకు సోకడం, ఇన్‌ఫెక్షన్ కలిగించడం తక్కువ శాతం అని, ఇది పెద్ద ప్రమాదం కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు.

మునుపటి వ్యాసం