ఇంటర్ ఫలితాలపై త్వరలోనే నిర్ణయం: ఏపీ విద్యాశాఖ

పది పరీక్షల ఫలితాలు ప్రకటించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటన

అమరావతి:  ఏపీలో ఇంటర్ పరీక్షల ఫలితాలపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని దాంతోపాటు పది పరీక్షల ఫలితాలు ప్రకటించేందుకు చర్యలు చేపట్టామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ఫలితాల ప్రకటనపై ఇప్పటికే సీఎం జగన్‌కు ప్రతిపాదనలు పంపామని ఆయన అన్నారు. కరోనా నేపథ్యంలో ఏపీ పది, ఇంటర్ పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ పరీక్షలను నిర్వహించాలని ప్రభుత్వం భావించింది. అయితే ఈ నెల 31వ తేదీలోపుగా పరీక్ష ఫలితాలను ప్రకటించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. పరీక్షల నిర్వహణతో పాటు ఫలితాల ప్రకటనకు సమయం సరిపోదని భావించి పరీక్షలను రద్దు చేసింది ప్రభుత్వం. విద్యార్థులకు మార్కుల కేటాయింపు విషయంలో కూడ ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది.ఈ కమిటీ సూచనల మేరకు విద్యార్థులకు  మార్కులను కేటాయించనున్నారు. 10వ తరగతి మార్కులు 30 శాతం, ఇంటర్ ప్రథమ సంవత్సరం మార్కులు 70 శాతం ప్రాతిపదికగా విద్యార్ధులకు సెకండియర్ మార్కులు కేటాయించాలని కమిటీ ప్రభుత్వానికి సిఫారసు చేసింది.

మునుపటి వ్యాసం