గోదావరికి భారీ వరద ప్రవాహం

కందకుర్తి త్రివేణి సంగమం ప్రాంతంలో నది ఉగ్రరూపం

నిజామాబాద్: తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో కురుస్తున్న ఏకధాటి వానకు గోదావరి నది ఉప్పొంగుతోంది. గడిచిన పది రోజులుగా కురుస్తున్న వానలతో గోదావరి తీవ్రస్థాయిలో ప్రవహిస్తోంది. తాజాగా రెండు రోజుల నుంచి మహారాష్ట్రలో కురిసిన వర్షానికి నీటి ప్రవాహం మరింత పెరిగింది. దీంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. కందకుర్తి త్రివేణి సంగమం ప్రాంతంలో గోదావరి ఉగ్రరూపంలో దాలుస్తోంది.