తెలంగాణలో కొత్తగా 691 కరోనా కేసులు

వైరస్ బారిన పడి ఐదుగురు మృతి

హైదరాబాద్‌: రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 1,14,260 కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేయగా 691 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, వైరస్ బారిన పడి మరో  ఐదుగురు ప్రాణాలు కోల్పోయినట్లు వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. తాజాగా 565 మంది బాధితులు కోలుకొని ఇళ్లకు వెళ్లినట్లు ఆ శాఖ పేర్కొంది. ప్రస్తుతం రాష్ట్రంలో 9,908 యాక్టివ్‌ కేసులున్నాయని పేర్కొంది. తాజాగా నమోదైన కేసులతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 6,38,721కు పెరిగాయి.. ఇందులో ఇప్పటి వరకు 6,25,042 మంది బాధితులు డిశ్చార్జి అయ్యారు. మహమ్మారి బారినపడి మొత్తం 3,771 మంది ప్రాణాలు కోల్పోయారు.

మునుపటి వ్యాసం