జుట్టుకో 'టీ'.. గ్రీన్ టీ

గ్రీన్ టీ తో జుట్టుకు బలం

హైదరాబాద్: మనలో చాలా మంది జుట్టు రాలడం సమస్యతో బాధపడుతుంటారు. వారికి నిపుణులు గ్రీన్ టీ తాగమని సూచిస్తున్నారట. ఎందుకంటే రోజూ గ్రీన్‌ టీ తో జుట్టు రాలడం ఆగిపోతుంది. అలాగే అందులో ఉన్న గుణాలు కురులను దృఢంగా చేస్తాయని వారు చెబుతున్నారు. జుట్టు మరో ముఖ్య కారణం చుండ్రు సమస్య. గ్రీన్‌ టీలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షిస్తూనే, రాలిన జుట్టు స్థానంలో కొత్త జుట్టు రావడానికి తోడ్పడుతున్నట్లు వారు తెలిపారు. బ్యాక్టీరియా, ఫంగస్‌ చేరడం వల్ల జుట్టు రాలుతుంది. గ్రీన్‌ టీతో జుట్టు కడుక్కోవడం వల్ల బ్యాక్టీరియా, ఫంగస్‌లు తొలగిపోతాయి. కుదుళ్ల రాలటాన్ని నియంత్రించడంలో సాయపడే  విటమిన్‌-బి గ్రీన్‌ టీ సమృద్ధిగా లభిస్తుంది. 

మునుపటి వ్యాసం