బ్రిస్బేన్‌లో 2032 ఒలింపిక్ క్రీడలు

32 ఏళ్ల తర్వాత మళ్లీ ఆతిథ్యం ఇవ్వనున్న ఆస్ట్రేలియా

టోక్యో: ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌లో 2032 ఒలింపిక్స్ క్రీడ‌ల‌ను నిర్వ‌హించ‌నున్నట్లు అంత‌ర్జాతీయ ఒలింపిక్ క‌మిటీ ప్రకటించింది. ఆతిథ్య న‌గ‌రం కోసం జ‌రిగిన ఓటింగ్‌లో బ్రిస్బేన్‌కు 72-5 తేడాతో ఓట్లు పోల‌య్యాయి. టోక్యో త‌ర్వాత‌ 2024లో పారిస్‌లో2028లో లాస్ ఏంజిల్స్‌లో ఒలింపిక్స్ జ‌ర‌గ‌నున్న విషయం తెలిసిందే. 2000 సంవ‌త్స‌రంలో ఆస్ట్రేలియాలోని సిడ్నీనగరంలో ఒలింపిక్స్ క్రీడలు జ‌రిగాయి. ఇప్పుడు మ‌ళ్లీ 32 ఏళ్ల విరామం త‌ర్వాత‌ ఆస్ట్రేలియాలో ఈ క్రీడ‌లు జ‌ర‌గ‌నున్నాయి. 1956లో ఒలింపిక్స్‌కు మెల్‌బోర్న్ ఆతిథ్యం ఇచ్చింది. ఆస్ట్రేలియాలో క్రీడ‌లు విజ‌య‌వంతంగా నిర్వ‌హించేందుకు ఏం చేయాలో త‌మ‌కు తెలుసని ఆ దేశ ప్ర‌ధాని స్కాట్ మారిస‌న్ తెలిపారు. 

Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox