‘కలిసికట్టుగా’ ఒలింపిక్‌ నినాదంలో సవరణలు

అధ్యక్షుడు థామస్‌ బాచ్‌ సూచన మేరకు మార్పు

టోక్యో : అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐవోసీ) ఒలింపిక్‌ నినాదంలో సవరణలు చేసింది. ‘వేగంగా, ఉన్నతంగా, బలంగా’ ఉన్న నినాదానికి కొత్తగా ‘కలిసికట్టుగా’ అనే పదాన్ని జోడించారు. కరోనా నేపథ్యంలో కమిటీ అధ్యక్షుడు థామస్‌ బాచ్‌ ‘కలిసికట్టుగా’ అనే పదాన్ని సూచించారు. ఈ మేరకు కమిటీ దీనిని ఏకగ్రీవంగా ఆమోదిస్తూ ఒలింపిక్‌ చార్టర్‌లో సవరణలు చేసింది. దీనిపై కమిటీ అధ్యక్షుడు స్పందిస్తూ.. 'ఈరోజు పరిస్థితి చూస్తే మీకు ఇదంతా చాలా సులభంగా జరిగిందని మీకు అనిపించవచ్చు. కానీ అది సత్యానికి దూరం. దీని వెనుక 15 నెలల పాటు మేము నిద్రలేని రాత్రులు గడిపామని' ఆయన అన్నారు.