ఆగస్టు 11న జవహర్‌ నవోదయ ప్రవేశ పరీక్ష

కేంద్ర విద్యాశాఖ ప్రకటన

న్యూదిల్లీ: జవహర్‌ నవోదయ విద్యాలయాల్లో 2021-22 విద్యాసంవత్సరాకి గాను ఆరో తరగతి ప్రవేశాలకు నిర్వహించే ప్రవేశ పరీక్ష తేదీ ఖరారైంది. ఆగస్టు 11న అన్ని ప్రాంతాల్లో ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు అందుకోసం  దేశవ్యాప్తంగా 11,182 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు కేంద్ర విద్యాశాఖ ప్రకటించింది. 2021-22 విద్యాసంవత్సరంలో 47,320 సీట్లకుగాను 24,17,009 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా పరీక్ష నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రవేశ పరీక్షలో మెరిట్‌ ఆధారంగా విద్యార్థులకు సీట్లు కేటాయిస్తారు.

 

మునుపటి వ్యాసం