రాజ్ కుంద్రా పోలీసు కస్టడీ 27 వరకు పొడిగింపు

మరో నిందితుడు రియాన్ తోర్పే కస్టడీ పొడిగింపు

ముంబయి: నీలి చిత్రాల చిత్రీకరణ, విక్రయం లాంటి ఆరోపణలను ఎదుర్కొంటూ అరెస్టైన ప్రముఖ వ్యాపారి, సినీ నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా పోలీసు కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే. పోలీసు కస్టడీని ఈనెల 27వ తేదీ వరకు పొడిగిస్తూ స్థానిక కోర్టు శుక్రవారం ఆదేశాలు జారీచేసింది. కుంద్రాను పోలీసు కస్టడీకి అప్పగిస్తూ ఇదివరకు మెజిస్ట్రేట్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల గడువు శుక్రవారం ముగియడంతో ఆయనను మరోసారి నేడు కోర్టు ముందు హాజరుపరిచారు. ఈ కేసు దర్యాప్తు చేయడానికి కుంద్రా కస్టడీని పొడిగించాలని పోలీసులు కోరడంతో ఈ నెల 27 వరకు పోలీసు కస్టడీని పొడిగిస్తూ మెజిస్ట్రేట్ ఆదేశాలు జారీచేసింది. కుంద్రాతోపాటు మరో నిందితుడు రియాన్ తోర్పేను కూడా మెజిస్ట్రేట్ ముందు పోలీసులు హాజరుపరచగా ఆయన కస్టడీని కూడా మెజిస్ట్రేట్ ఈ నెల 27 వరకు పొడిగించారు. ఐపీసీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంని వివిధ సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన ముబయి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఈ నెల 19న రాజ్ కుంద్రాను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. 

 

మునుపటి వ్యాసం