సూర్య 'జై భీమ్' ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

న్యాయవాది పాత్రలో అదరగొట్టనున్న సూర్య

హైదరాబాద్: విభిన్న కథలు, పాత్రల్లో నటించడానికి తమిళనటుడు హీరో సూర్య ఎప్పుడు ముందుంటారు. ఆయన ఇటీవల నటించిన ఆకాశమే హద్దురా చిత్రం ప్రేక్షకుల మన్నలను అందుకుంది. అదే ఊపులో తాజాగా సూర్య నటించిన చిత్రం 'జై భీమ్'. నేడు సూర్య పుట్టినరోజు సందర్భంగా 'జై భీమ్' చిత్రం నుంచి ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఈ సినిమాకు టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో సూర్య ఓ న్యాయవాది పాత్ర పోషిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో కేరళ యువ నటి రాజీషా విజయన్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రకాశ్ రాజ్ ముఖ్యపాత్రలో కనిపించనున్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను ప్రకటించనున్నారు.

 

మునుపటి వ్యాసం