రెండు కార్లు ఢీకొని 8 మంది మృతి

హైదరాబాద్-శ్రీశైలం హైవేపై ప్రమాదం

నాగర్‌కర్నూల్‌: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. హైదరాబాద్-శ్రీశైలం హైవేపై వేగంగా వెళ్తున్న రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో 8 మంది మృతి చెందారు. ఉప్పునూతల మండలం చెన్నారం గేట్ సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాద ధాటికి రెండు కార్లు నుజ్జునుజ్జయ్యాయి. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాలను నాగర్ కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 

మునుపటి వ్యాసం