30 రైళ్లు రద్దు చేసిన సెంట్రల్ రైల్వే

భారీ వర్షాల కారణంగానే రద్దు

హైదరాబాద్: నైరుతి రుతుపవనాల ప్రభావంతో దేశంలో గత పదిరోజుల నుంచి వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణ, మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాల్లో వాగులు, కాలువలు, వంకలు నిండి పొంగిపొర్లుతున్నాయి. మహారాష్ట్రలోని ముంబయి, రత్నగిరి, రాయగఢ్, నాసిక్ ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. రాయ్ గఢ్ లో కొన్నిచోట్ల కొండ చరియలు విరిగి పడటంతో 36 మంది మరణించారు. అదే విధంగా ఆయా ప్రాంతాల్లో రైలు పట్టాలపై నీళ్లు నిలిచిపోవడంతో పలు రైళ్లు రద్దు చేస్తున్నట్లు సెంట్రల్ రైల్వే డివిజన్ అధికారులు ప్రకటించారు. ముంబయి, కొంకణ్ రీజియన్లలో30 రైళ్లను రద్దు చేసినట్లు అధికారులు వెల్లడించారు. మరో 12 రైళ్లను రూటు మళ్లించామని, మరో 8 రైళ్లు చివరి స్టేషన్‌ వరకూ వెళ్లకుండా మార్గం సరిగా ఉన్న స్టేషన్లలో ప్రయాణం ముగించేలా మార్పులు చేశామని రైల్వే శాఖ పేర్కొంది. 

మునుపటి వ్యాసం