గురు పౌర్ణమి వేడుకలకు రామకృష్ణ మఠం ముస్తాబు

ఉదయం ఏడు గంటల నుంచి విశేష పూజలు

హైదరాబాద్: రేపు గురు పౌర్ణమి సందర్భంగా నగరంలోని అశోక్ నగర్ రామకృష్ణ మఠంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. గురుపూర్ణిమ సందర్భంగా ఈ నెల 24న (రేపు) ఉదయం 7 గంటలకు విశేష పూజలు ప్రారంభమవుతాయి. 8 గంటలకు భజనలు, 10:45 కు హోమం, 11:15 కు తెలుగులో ప్రసంగ కార్యక్రమాలు ఉండనున్నాయి. మధ్యాహ్నం 12:05 నిమిషాలకు విశేష హారతి, సాయంత్రం 6:45 కు ఆరాత్రికం ఉంటాయని మఠం అధికారులు తెలిపారు. రాత్రి 7:15 నిమిషాలకు ప్రత్యేక భజనలుంటాయి. ఈ సంద‌ర్భాన్ని పుర‌స్క‌రించుకుని మఠంలోని పుస్తకాలపై 40 శాతం రాయితీ ఉంటుందని, మ‌రికొన్ని పుస్తకాలపై 20 శాతం వరకు రాయితీ ఉంటుంద‌ని నిర్వాహ‌కులు తెలిపారు. భక్తులు ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా రామకృష్ణ మఠం ప్రతినిధులు సూచించారు.

 

మునుపటి వ్యాసం