225 పరుగులకు వెనుదిరిగిన భారత ఆటగాళ్లు

వర్షం అంతరాయం కారణంగా 47 ఓవర్లకే కుదింపు

కొలంబో: శ్రీలంకతో చివరి వన్డేలో భారత్ 225 పరుగులకు ఆలౌట్ అయింది. వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్ ను 47 ఓవర్లకు కుదించగా, టీమిండియా 43.1 ఓవర్లకు ఆలౌటైంది. లంక స్పిన్నర్లు ప్రవీణ్ జయవిక్రమ, అఖిల ధనంజయ చెరో 3 వికెట్లు తీసి భారత్ ను దెబ్బతీశారు. దుష్మంత చమీర 2 వికెట్లు తీయగా, చమిక కరుణరత్నే, కెప్టెన్ దసున్ షనక చెరో వికెట్ దక్కించుకున్నారు. భారత ఆటగాళ్ల ఇన్నింగ్స్ లో ఓపెనర్ పృథ్వీ షా 49, వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ సంజు శాంసన్ 46, సూర్యకుమార్ యాదవ్ 40 పరుగులు చేశారు. మూడు వన్డేల సిరీస్ ను భారత్ ఇప్పటికే 2-0తో చేజిక్కించుకున్న విషయం తెలిసిందే. 

 

మునుపటి వ్యాసం