తెలంగాణలో కొత్తగా నమోదైన కరోనా కేసుల వివరాలు

643 పాజిటివ్ కేసులు, 4 మరణాలు

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 643 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కరోనా బాధితుల్లో 767 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. నలుగురు మృతి చెందినట్లు వైద్యారోగ్య శాఖ తాజా హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం పాజిటివ్‌ కేసులు 6.39 లక్షలకు పెరిగాయి. ఇవాళ్టి వరకు 6.25 లక్షల మందికిపైగా కోలుకున్నారు. ఇంకా 9,729 పైగా యాక్టివ్‌ కేసులున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 3,775 గా ఉంది.  రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ 1,20,530 మందికి కరోనా పరీక్షలు చేశారు

 

మునుపటి వ్యాసం