తిరుమలలో స్వల్పంగా తగ్గిన భక్తుల రద్దీ

నిన్న స్వామివారికి 6,695 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ స్వల్పంగా తగ్గింది. సోమవారం తిరుమల శ్రీవారిని 14,518 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 1.62 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. నిన్న స్వామివారికి 6,695 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. 

మునుపటి వ్యాసం