టోక్యో ఒలింపిక్స్: భారత పురుషుల హాకీ జట్టు శుభారంభం

10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మహిళల క్వాలిఫికేషన్ లో భారత్ కు నిరాశ

టోక్యో: టోక్యో ఒలింపిక్స్ క్రీడాలు నిన్న(శుక్రవారం) ప్రారంభోత్సవ కార్యక్రమం వంద మంది అతిథుల మధ్య అంగరంగ వైభవంగా జరిగాయి. ఇవాళ ప్రారంభమైన క్రీడల్లో భారత్ గెలుపుతో ఆరంభించింది. పూల్-ఏ తొలి మ్యాచ్ లో న్యూజిలాండ్ పై 3-2 గోల్స్ తేడాతో భారత హాకీ జట్టు విజయం సాధించింది.

ఆర్చరీ మిక్స్ డ్ టీమ్ విభాగంలో భారత్ క్వార్టర్ ఫైనల్ కు అర్హత సాధించింది. చైనీస్ తైపీ పై 5-3 తేడాతో దీపికా కుమారి, ప్రవీణ్ జాదవ్ అద్భుత విజయం సాధించారు. క్వార్టర్ ఫైనల్ లో భారత్, దక్షిణ కొరియాతో తలపడే అవకాశం. 

ట్యోక్యో ఒలింపిక్స్ లో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మహిళల విభాగంలో చైనాకు తొలిస్వర్ణం లభించింది. యాంగ్ క్వియాన్ స్వర్ణ పతాకంతో గెలుపు బాట పట్టాడు. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మహిళల క్వాలిఫికేషన్ లో భారత్ కు నిరాశ మిగిలింది. భారత మహిళా షూటర్లు ఫైనల్ కు చేరలేకపోయారు. 626.5 పాయింట్లతో 16 వ స్థానంలో ఎలవెనిల్ వలెరియన్, 621.9 పాయింట్లతో 36 వ స్థానంలో నిలిచిన అపూర్వి చందేలా ఉన్నారు.