టోక్యో ఒలింపిక్స్‌ లో రజత పతకంతో మెరిసిన మీరాబాయ్ చాను

చైనా వెయిట్‌లిఫ్ట‌ర్ హూ జిహూయి కి బంగారు పతకం

టోక్యో: టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌ శుభారంభం చేసింది. వెయిట్‌ లిఫ్టింగ్‌లో మీరాబాయి చాను 49 కిలోల విభాగంలో రజత పతకం సాధించి చరిత్ర సృష్టించింది. స్నాచ్ లో 87 కిలోలు, క్లీన్ అండ్ జర్క్ లో 115 కిలోలు మొత్తంగా 202 కిలోలు ఎత్తి భారత్ గర్వించేలా చేసింది. 1996 త‌ర్వాత ఈ ఈవెంట్‌లో భార‌త్ గెలిచిన తొలి ప‌త‌కం ఇదే కావడం విశేషం. మ‌రోవైపు చైనా వెయిట్‌లిఫ్ట‌ర్ హూ జిహూయి 210 కేజీల‌తో బంగారు పతకం గెల‌వ‌గా.. ఇండోనేషియా కాంస్య  పతకం సొంతం చేసుకుంది. గోల్డ్ కోసం క్లీన్ అండ్ జెర్క్‌లో మీరాబాయ్ చివ‌రి ప్ర‌య‌త్నంలో 117 కేజీల బ‌రువు ఎత్త‌డానికి ప్ర‌య‌త్నించి విఫ‌ల‌మైంది.