భారత్ లో కొత్తగా నమోదైన కరోనా కేసుల వివరాలు

తాజాగా 39,097 వేల కేసులు నమోదు

న్యూదిల్లీ: గడిచిన 24 గంటల వ్యవధిలో భారత్ లో కొత్తగా 39,097 కరోనా కేసులు నమోదవ్వగా, కొత్తగా 546 మంది కరోనాతో చనిపోయారని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. కొత్తగా నమోదైన కేసులతో  మొత్తం కేసుల సంఖ్య 3,13,32,159కు చేరింది. ఇందులో 3,05,03,166 మంది కరోనా నుంచి కోలుకున్నారని,  4,20,016 మంది కరోనాతో చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు. మొత్తం కేసుల్లో 4,08,977 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని వారు పేర్కొన్నారు. కొత్తగా 35,087 మంది కరోనా నుంచి కోలుకున్నారని అధికారులు తెలిపారు. స్వీయ నియంత్రణ పాటించాలని, శానిటైజర్, మాస్క్ విధిగా ధరించాలని అధికారులు తెలిపారు. 

 

మునుపటి వ్యాసం